Dragon fruit benefits in Telugu

డ్రాగన్ ఫ్రూట్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో రోగాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే తినే ఆహారం,

dragon fruit in telugu


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో రోగాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. తినే ఆహారం, ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి వల్ల మనిషి అనారోగ్యం బారిన పడతాడు. అయితే మంచి ఆరోగ్యం కోసం వివిధ రకాల పండ్లను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దాదాపు అవి అన్నీ ఒకే చోట దొరుకుతాయి అదే డ్రాగన్ ఫ్రూట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇటీవల ఈ పండు ప్రతి పట్టణం మరియు నగరంలో అందుబాటులో ఉంది. డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. ఇందులో నల్లటి గింజలు ఉంటాయి.

Advertisement
dragon fruit in telugu


డ్రాగన్ ఫ్రూట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది?


డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా అంటారు. చైనాలో డ్రాగన్ ఒక పవిత్ర జంతువు. అటువంటి డ్రాగన్‌లు ఇప్పటికీ ఉన్నాయని, వాటి నోటి నుండి వచ్చే మంటలతో శత్రువులను చంపేస్తాయి అని చైనీయులు నమ్ముతారు. మరియు ఈ పండ్లకు అలా పేరు ఎందుకు పెట్టబడింది అంటే, వాటి ఆకర్షణీయమైన రంగు మరియు ఆకృతి కారణంగా, ఒకే చోట చాలా పండ్ల ఉన్న డ్రాగన్ ఫ్రూట్‌ను సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ పండు గులాబీ రంగులో ఉండి చుట్టూ ఉన్న రేకులు పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో ఉద్భవించింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయిలాండ్ మరియు వియత్నాం ప్రజలు ఈ పండును చాలా ఇష్టపడతారు.

క్యాలరీలు తక్కువ.. మినరల్స్ ఎక్కువ..


ఈ డ్రాగన్ ఫ్రూట్ లో కేలరీలు తక్కువగానూ, మినరల్స్ అధికంగానూ ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ మొదలైన విలువైన పోషకాలు అందుబాటులో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువగానే ఉన్నా.. శరీరానికి శక్తినిచ్చే పోషకాల పరంగా ఇది విలువైనదే. అందుకే ఈ పండు తింటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

dregon fruit benefits

వ్యాధిని తరిమికొట్టే పండు


ప్రస్తుత కాలంలో మనిషి రోగనిరోధక శక్తిని కోల్పోతున్నాడు. ఇప్పటికే కరోనా సీజన్.. అందుకే వర్షాకాలం కావడంతో చుట్టుపక్కల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మనం అనారోగ్యానికి గురవుతాం. ఈ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని సహజ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

రోగనిరోధక శక్తికి


ఈ డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి మరియు కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు లేదా ఇతర వ్యాధులు మన దరిచేరకుండా నిరోధిస్తుంది.డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో ఇతర పండ్ల కంటే ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ ఫ్రూట్స్. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. దీని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో విత్తనాలు ఉంటాయి. విత్తనాలతో కలిపి తింటారు. ఆ కరకరలాడే గింజలను అందరూ ఇష్టపడతారు.

dragon fruit benefits in telugu

ఇవి ఖరీదైనవి


ప్రస్తుతం ఈ పండ్లు సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి. ఒక్కో పండు (సుమారు 400 గ్రాముల బరువు) రూ.70 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. అయితే ధర కాస్త ఎక్కువైనా చాలా మంది కొంటారు. ఇంతవరకు ఈ పండ్ల రుచి ఎలా ఉంటుందో చెప్పలేదు. అవి కాస్త పుల్లగానూ, కాస్త తియ్యగానూ ఉంటాయి. తక్కువ తీపి కలిగి ఉంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*